భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు నేను ఎవరు - ఈ శరీరమా లేక తెలియనిదేదో వున్నదా - పూర్వకాలం నుండి ఎందరో మహర్షులు సాధన చేసి తెలుసుకొన్న సత్యం - చైతన్యమే సర్వత్ర వ్యాపించి వున్నది - శరీరము కాదు శారీరిని అని అనుభవపూర్వకంగా తెలుసుకొని తరించడమే జీవిత పరమావధి - పరంపరానుగతంగా ఉన్నటువంటి విద్య అదియే బ్రహ్మ విద్య - శ్రీ శంకర భాగవత్పాదుల అద్వైత సిద్ధాంతమే సనాతన ధర్మం - అష్టావకృని "సాకారం అనృతం విధ్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్ తత్త్వోపదేశేన న పునర్భవ సంభవః" అనునదే యదార్ధం